Daily Archives: June 26, 2013

మారుతి బన్నీ తో సినిమా చేస్తాడా?

imagesప్రతిభ ఎక్కడుంటే అక్కడ‌… ప్రత్యక్షమైపోయి వారిని క‌లుపుకుపోవ‌డంలో మెగా ఫ్యామిలీ ముందుంటుంది. అందునా.. అల్లు అర‌వింద్‌. ఆయ‌న దృష్టి ఇప్పుడు మారుతిపై ప‌డింది. ఈరోజుల్లో సినిమా హిట్టు కొట్టిన వెంట‌నే – మారుతి చేతిలో అడ్వాన్స్ పెట్టేశారు. భ‌విష్యత్తు అవ‌స‌రాల నిమిత్తం. మారుతి కూడా మెగా ఫ్యామిలీలో ఒక‌డిగా పెరిగాడు కాబట్టి, ఆ కన్సర్న్‌తో ఎంత‌మంది అవ‌కాశాలిచ్చినా, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కొత్తజంట సినిమాకు శ్రీ‌కారం చుట్టాడు. ఈ సినిమా క‌థ విష‌యంలో మారుతి చూపిస్తున్న శ్రద్ధ, త‌ప‌న అల్లు అర‌వింద్‌కి బాగా న‌చ్చేశాయ‌ట‌. దాంతో బ‌న్నీతో కూడా ఓ సినిమా చేసి పెట్టమ‌నే ప్రపోజ‌ల్ తీసుకొచ్చారాయ‌న‌.

బ‌న్నీ, మారుతికి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ఈరోజుల్లో సినిమా ప్రమోష‌న్‌లో పాల్గొని, ఆ సినిమాకి కావ‌ల్సినంత ప‌బ్లిసిటీ వ‌చ్చేలా చేశాడు బ‌న్నీ. ఇప్పుడు అదే బ‌న్నీతో సినిమా చేయమంటే మారుతి కాదంటాడా?? హ్యాపీగా ఒప్పేసుకొన్నాడు. అటు అల్లు అర్జున్‌, ఇటు మారుతి చేతి నిండా క‌మిట్‌మెంట్స్తో తో బిజీ బిజీగా ఉన్నారు. ఆ సినిమాల‌న్నీ పూర్తయ్యాకే ఈ కాంబినేష‌న్ సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి. ఒక‌వేళ కొత్తజంట హిట్టయిపోయి, శిరీష్ హిట్ హీరో అయిపోతే – బ‌న్నీ సినిమా కూడా ఆ ఊపులోనే మొద‌లైపోయినా షాక్ తిన‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

 

దేవదాసుకి కు షష్టిపూర్తి…

anrdevadasuకొన్ని కథలు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తాయి..ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తాయి. అలా వెండితెర మీద 14 సార్లు ఆవిష్కరింపబడిన అరుదైన కథ దేవాదాసు.. దాదాపు భారతీయ భాషలన్నింటిలో తెరకెక్కిన దేవాదాసు తెలుగు వెండితెర మీద ఆవిష్కరింపబడి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ చిత్ర విశేషాలు తెలుసుకుందాం..దేవదాసు పాత్ర అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అక్కినేని నాగేశ్వర్రావు.. అవును అసలు దేవాదాసు ఇలాగే ఉంటాడేమో అనేంత బాగా నటించారు ఆయన.. శరత్  రాసిన నవలా నాయకున్ని కళ్లకు కట్టినట్టుగా మన ముందు ఆవిష్కరించారు..

ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో పాత్ర పార్వతి.. ఈ పాత్రల్లో ఎంతో హుందాగా ఓదిగిపోయింది సావిత్రి.. జానకీ చేయాల్సిన పాత్ర అదృష్టం కొద్ది సావిత్రిని వరించటంతో ఆ అవకాశాన్ని ఎంతో బాగా ఉపయోగించుకుంది.. 17 ఏళ్ల వయసులోనే తను తప్ప మరెమరూ ఆ పాత్రకు అంతగా న్యాయం చేయలేరేమో అనేంత బాగా నటించి మెప్పించింది.

తెలుగులో అక్కినేని నటించిన దేవదాసు రిలీజ్‌ నాడే, పోటీగా సైగల్ నటించిన హిందీ దేవదాసును విడుదల చేశారు బాలీవుడ్‌ నిర్మాతలు.. అయినా తెలుగు దేవాదాసు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.. అంతేకాదు భారతీయ చరిత్రలోనే అన్ని దేవాదాసుల కంటే ఏఎన్నార్‌ హీరోగా నటించిన దేవాదాసే భారీ విజయం సాదించింది.

1951 నవంబర్ 24న మద్రాసులోని రేవతి స్టూడియోలో రాత్రి 8 గంటలకు దేవదాసు షూటింగ్ ప్రారంభమైంది. ఎంత మంది వద్దు అంటున్నా .. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఎలాగైనా ఈ సినిమా పూర్తి చేయాలనే దృడ సంకల్పంతో సినిమా ప్రారంబించారు నిర్మాత  ద్రణావధ్యుల లక్ష్మీ నారాయణ..నిర్మాత లక్ష్మీ నారాయణ గారు అంత సాహసం చేయటం వెనుక కారణం లేకపోలేదు.. దేవాదాసు కథ అప్పటికే బాలీవుడ్‌ తెర మీద మంచి సక్సెస్‌ సాదించింది.. అంతకు మించి దర్శకులు వేదాంతం రాఘవయ్యగారు భారీ బరోసా ఇవ్వటంతో నిర్మాత నిశ్చింతగా ఉన్నారు..

ఇక ఈ చిత్రానికి మరో ఎసెట్‌ సీనియర్‌ సముద్రాల.. ఈ సినిమాకు మాటలు పాటలు అందించిన సముద్రాల ప్రతీ అక్షరంలోనూ తన మార్క్‌ చూపించారు.. అంతేకాదు ఈ సినిమాలో ఉన్న పదకొండు పాటలూ ఆయనే రాయడం విశేషం..తెలుగులో అక్కినేని నటించిన దేవదాసు రిలీజ్‌ నాడే, పోటీగా సైగల్ నటించిన హిందీ దేవదాసును విడుదల చేశారు బాలీవుడ్‌ నిర్మాతలు.. అయినా తెలుగు దేవాదాసు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.. అంతేకాదు భారతీయ చరిత్రలోనే అన్ని దేవాదాసుల కంటే ఏఎన్నార్‌ హీరోగా నటించిన దేవాదాసే భారీ విజయం సాదించింది.