Blog Archives

రూమర్స్ కు చెక్ పెట్టిన అఖిల్ …

imagesఅక్కినేని వారి వంశంలో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ నటుడిగా తెరంగ్రేటం చెయ్యడానికి సిద్ధంగావున్నాడు. గత కొన్ని నెలలుగా అఖిల్ మొదటి సినిమా కోసం కొందరు ప్రముఖ డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు లెక్కలేనన్ని వార్తలు వచ్చాయి. ఇదిలావుంటే అఖిల్ ఎంట్రీ ఎప్పుదు అనేది నాగార్జునగారు కుడా ప్రకటించట్లేదు. ఇటీవలే ఒక వర్గం మీడియా అఖిల్ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని తెలిపారు. అయితే ఈ పుకార్లను అఖిల్ కొట్టిపారేశాడు. ఈ వార్తకు అఖిల్ స్పందిస్తూ “నేను ఇప్పటిదాకా ఎటువంటి సినిమాను అంగీకరించలేదు. నా మొదటి సినిమాకు సిద్ధపడుతున్నాను” అని తెలిపాడు. అఖిల్ చిన్నతనంలో నాగార్జున నటించిన ‘సిసింద్రి’ సినిమాలో నటించాడు. అఖిల్ హీరోగా నటించనున్న మొదటి సినిమా ఏంటో త్వరలోనే చూద్దాం మరి..

బాబు ని అభినిం దించిన అక్కినేని …

cbn-anrమాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ను ప్రముఖ సినీనటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కలిసారు. వేరెవ్వరూ స్పందించని రీతిలో ఉత్తరాఖండ్ విషయంలో చంద్రబాబు స్పందించిన తీరును ఆయన ప్రస్తుతించారు. బాధితులను పరామర్సించటం లోనూ, వారికి కావలసిన ఏర్పాట్లు చేయటం లోనూ, తెలుగువారిని డెహ్రాడూన్ నుంచి వారి వారి స్వస్థలాలకు తరలించటం లోనూ చంద్రబాబు ఎంతో బాధ్యతగా ప్రవర్తించారని, ఇది నిజంగా అభినందనీయమని అక్కినేని చంద్రబాబును వ్యక్తిగతంగా కొనియాడారు. షుమారు అరగంటకు పైగా వారిరువురు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎటువంటి రాజకీయ చర్చలు రాలేదని, కేవలం వ్యక్తిగతమని పార్టీ వర్గాలు తెలిపాయి.

దేవదాసుకి కు షష్టిపూర్తి…

anrdevadasuకొన్ని కథలు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తాయి..ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తాయి. అలా వెండితెర మీద 14 సార్లు ఆవిష్కరింపబడిన అరుదైన కథ దేవాదాసు.. దాదాపు భారతీయ భాషలన్నింటిలో తెరకెక్కిన దేవాదాసు తెలుగు వెండితెర మీద ఆవిష్కరింపబడి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ చిత్ర విశేషాలు తెలుసుకుందాం..దేవదాసు పాత్ర అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అక్కినేని నాగేశ్వర్రావు.. అవును అసలు దేవాదాసు ఇలాగే ఉంటాడేమో అనేంత బాగా నటించారు ఆయన.. శరత్  రాసిన నవలా నాయకున్ని కళ్లకు కట్టినట్టుగా మన ముందు ఆవిష్కరించారు..

ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో పాత్ర పార్వతి.. ఈ పాత్రల్లో ఎంతో హుందాగా ఓదిగిపోయింది సావిత్రి.. జానకీ చేయాల్సిన పాత్ర అదృష్టం కొద్ది సావిత్రిని వరించటంతో ఆ అవకాశాన్ని ఎంతో బాగా ఉపయోగించుకుంది.. 17 ఏళ్ల వయసులోనే తను తప్ప మరెమరూ ఆ పాత్రకు అంతగా న్యాయం చేయలేరేమో అనేంత బాగా నటించి మెప్పించింది.

తెలుగులో అక్కినేని నటించిన దేవదాసు రిలీజ్‌ నాడే, పోటీగా సైగల్ నటించిన హిందీ దేవదాసును విడుదల చేశారు బాలీవుడ్‌ నిర్మాతలు.. అయినా తెలుగు దేవాదాసు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.. అంతేకాదు భారతీయ చరిత్రలోనే అన్ని దేవాదాసుల కంటే ఏఎన్నార్‌ హీరోగా నటించిన దేవాదాసే భారీ విజయం సాదించింది.

1951 నవంబర్ 24న మద్రాసులోని రేవతి స్టూడియోలో రాత్రి 8 గంటలకు దేవదాసు షూటింగ్ ప్రారంభమైంది. ఎంత మంది వద్దు అంటున్నా .. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఎలాగైనా ఈ సినిమా పూర్తి చేయాలనే దృడ సంకల్పంతో సినిమా ప్రారంబించారు నిర్మాత  ద్రణావధ్యుల లక్ష్మీ నారాయణ..నిర్మాత లక్ష్మీ నారాయణ గారు అంత సాహసం చేయటం వెనుక కారణం లేకపోలేదు.. దేవాదాసు కథ అప్పటికే బాలీవుడ్‌ తెర మీద మంచి సక్సెస్‌ సాదించింది.. అంతకు మించి దర్శకులు వేదాంతం రాఘవయ్యగారు భారీ బరోసా ఇవ్వటంతో నిర్మాత నిశ్చింతగా ఉన్నారు..

ఇక ఈ చిత్రానికి మరో ఎసెట్‌ సీనియర్‌ సముద్రాల.. ఈ సినిమాకు మాటలు పాటలు అందించిన సముద్రాల ప్రతీ అక్షరంలోనూ తన మార్క్‌ చూపించారు.. అంతేకాదు ఈ సినిమాలో ఉన్న పదకొండు పాటలూ ఆయనే రాయడం విశేషం..తెలుగులో అక్కినేని నటించిన దేవదాసు రిలీజ్‌ నాడే, పోటీగా సైగల్ నటించిన హిందీ దేవదాసును విడుదల చేశారు బాలీవుడ్‌ నిర్మాతలు.. అయినా తెలుగు దేవాదాసు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.. అంతేకాదు భారతీయ చరిత్రలోనే అన్ని దేవాదాసుల కంటే ఏఎన్నార్‌ హీరోగా నటించిన దేవాదాసే భారీ విజయం సాదించింది.

 

ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న “మనం”

AKKINENI

అక్కినేని కుటుంబ చిత్రంగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “మనం” షూటింగ్ ప్రస్తుతం రాజధాని నగరంలో వేగంగా జరుగుతోంది. నాగార్జున కు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా విక్రమ్ కుమార్ చిత్రికరిస్తున్నాడు. మూడు తరాల ప్రతినిధులుగా అక్కినేని, నాగార్జున, నాగ చైతన్య నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు సరసన బాలీవుడ్ నటి రేఖ నటిస్తోంది అని వచ్చిన వార్తలు గాలి వార్తలు అని అక్కినేని సరసన నటించే నటిమణి కోసం అన్వేషణ జరుగుతోందని దర్శకుడు విక్రమ్ కుమార్ తెలిపారు. ఎట్టి పరిస్థితులలోనూ ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో నాగార్జున ఉన్నాడనే టాక్. అంతేకాకుండా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ఒకే సారి నిర్మించాలని నాగ్ , విక్రమ్ కుమార్ ఆలోచన చేస్తున్నారట.

అక్కినేని మనం మరో మూగ మనసులా?

images (4)అక్కినేని హీరోల సినిమా మ‌నం.. మరో మ‌గ‌ధీర కాబోతోందా? వాల‌కం చూస్తుంటే అలాగే ఉంది. మ‌గ‌ధీర అన‌గానే బ‌డ్జెట్‌లోనో, రికార్డుల‌లోనే అనుకొనేరు. క‌థ విష‌యంలో అక్కినేని సినిమా మూగ మనసులు లా  పున‌ర్జన్మల నేప‌థ్యంలో న‌డిచే క‌థ‌. హీరో, హీరోయిన్‌, విల‌న్ మ‌రో జ‌న్మ ఎత్తి – పూర్వజ‌న్మని గుర్తు తెచ్చుకొంటారు. ఇప్పుడు మ‌నం సినిమా విష‌యంలోనూ ఇదే జరుగుతోంది. విక్రమ్ కె కుమార్ ద‌ర్శక‌త్వం వ‌హించే చిత్రమిది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. మనం… ఓ పున‌ర్జన‌ల స్టోరీ అట‌. మ‌రి నాగేశ్వర‌రావు, నాగార్జున‌, చైతూ ఈ ముగ్గురిలో ఎవ‌రి పున‌ర్జన్మ ఎత్తుతారు అనేది మాత్రం స‌స్పెన్స్‌! శ్రియ‌, స‌మంత క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. త్వర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

 

అక్కినేని ఆవకాయ పచ్చడి …

Nagarjuna-Latest-Stills(1)హీరో నాగ్ మదర్స్ డే సందర్భం గా తన జ్ఞాపకాలను పంచుకున్నారు షూటింగ్ అంటే ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఉదయం లొకేషన్‌కి వెళ్లేప్పుడు హుషారుగా, సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేటప్పుడు అలసటతో ఇంటికి తిరిగొస్తుంటాం. ఇంటికి రాగానే ‘అలసిపోయావా’ అంటూ అమ్మ తల నిమురుతుండేది. నాన్నగారు అది గమనించి ‘ఎప్పుడైనా నన్నలా చేశావా?’ అని సరదాగా అడిగేవారు. అప్పుడు అమ్మ ‘మీరు వేరు.. మా అబ్బాయి వేరు’ అనేది. పిల్లలు పుట్టేవరకు భర్త మీద, పుట్టిన తర్వాత భర్త మీదకన్నా ఆడవాళ్లకి పిల్లల మీద ఎక్కువగా ప్రేమ ఉంటుందట. ఇలా జరిగినప్పుడు నాకది కరెక్ట్ అనిపించేది.

అమ్మ చనిపోయినప్పుడు, ఇక అమ్మ లేదే అనే బాధ మరోవైపు.. అనారోగ్యంతో తను పడిన బాధల నుంచి విముక్తి దొరికిందనే ఫీలింగ్ మరోవైపు. ఏదేమైనా అమ్మ లేని లోటు ఎప్పటికీ లోటుగానే ఉంటుంది. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్నగారు సినిమాలతో బిజీగా ఉండేవారు కాబట్టి అమ్మతో ఎక్కువ సమయం గడిపేవాణ్ణి. నాకేం కావాలన్నా అమ్మతో చెప్పి నాన్నకి సిఫార్సు చేయించుకునేవాణ్ణి. కుటుంబ బాధ్యతలన్నీ మోస్తున్నా అమ్మలో ఆ విసుగు ఇసుమంత కూడా కనిపించేది కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఆ నవ్వు చూస్తే టెన్షన్స్ అన్నీ ఇట్టే మాయమయ్యేవి. సమ్మర్ వస్తే చాలు.. మా ఫ్యామిలీ మొత్తానికి ఆవకాయ పచ్చడి పట్టేది. ఆ రుచి ఎంత కమ్మగా ఉండేదో. అమ్మ పోయిన తర్వాత ఆ బాధ్యతను నాన్నగారు తీసుకున్నారు. అమ్మ ఉన్నప్పుడు రెసిపీ రాయించుకున్నారు. దాన్ని ఫాలో అవుతూ, ఆవకాయ పచ్చడి తయారు చేయించారు. టేస్ట్ చేస్తే అచ్చం అమ్మ పెట్టినట్టే ఉంది. ‘అక్కినేని ఆవకాయ’ అని పేరు పెట్టి, అమ్మితే సేల్స్ బ్రహ్మాండంగా ఉంటుందని నాన్నతో సరదాగా అన్నాను. అమ్మ గురించి ఇంకా చెప్పాలంటే.. ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతే ఇట్టే గ్రహించేసేది. ‘ఏమైంది నాన్నా..’ అంటూ ఆప్యాయంగా మాట్లాడేది. అప్పుడు మూడ్ మళ్లీ మామూలుగా మారిపోయేది. అదీ మా అమ్మ గొప్పదనం.’’అంటూ తన తల్లిని గుర్తుకు తెచ్చు కున్నారు ..

ఆ విషయంలో మాత్రం ఓడిపోయాను అంటున్న అక్కినేని….!

akkineniఅక్కినేని ఏమి మాట్లాడినా ఆయన మాట్లాడిన ప్రతి మాటలోనూ ఎంతో వేదాంతం ఉంటుంది. తను చిన్నప్పుడు ఆర్ధిక ఇబ్బందుల వల్ల చదువుకోలేక పోయానని, హీరో అయిన తరువాత తను ఎప్పుడూ కడుపు నిండా అన్నం తినలేకపోయానని, లావు అయిపోతాననే భయంతో కేవలం మజ్జిగ తాగి ఆకలి చంపుకొనేవాడినని ఇప్పుడు అది తనకు అలవాటు అయిపోయిందని అని చెపుతూ అక్కినేని నిన్న హైదరాబాద్ అన్నపూర్ణ ఇంటర్ నేషనల్ స్కూల్ అఫ్ మీడియా సంబంది౦చిన కార్యక్రమంలో పాల్గొంటూ మరోక కొత్త విషయం చెప్పారు. తన జీవితంలో అన్నీ చేయగలిగానని కాని దర్శకత్వం చేద్దాం అని కోరిక ఉన్నా ఆ బాధ్యత అంటే భయం వేసి సినిమా దర్శకత్వం వైపు వెళ్ళలేకపోయానని 1974 లో తనకు శస్త్ర చికిత్స జరిగిన తరువాత అనేక సార్లు నటించడం మాని వేద్దాం అని అనుకున్నానని కాని అది తన బలహీనతగా మారిపోయి ఆ విషయంలో మాత్రం తాను జీవితంలో ఓడిపోయానని అక్కినేని అంటున్నారు. తను ఎంతో అభిమానంగా నిర్మించుకున్న అన్నపూర్ణ స్టూడియోస్ తనకు నాలుగోవ కూతురు లాంటిదని వరసగా రెండు రోజులు స్టూడియో దగ్గరకు రాకపోతే తను జీవితంలో ఏదో పోగొట్టుకున్నాననే భావన కలుగుతుందని చెపుతూ, సినిమా  విజయవంతం కావడం ఆ సినిమాకు తయారు చేసిన స్క్రీన్ ప్లే పైనే ఆధార పడి ఉంటుందని మాయాబజార్ సినిమా కు అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంది కాబట్టే ఆ సినిమాను మరో పాతిక సంవత్సరాలు తరువాత కూడా ఇలాగే చూస్తారని చెపుతూ తన అనుభవాలు ఎన్నిటినో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విధ్యార్ధులతో పంచుకున్నారు. భారతీయ సినిమా పుట్టి వంద సంవత్సరాలు అయిన సందర్భంలో 90 ఏళ్ళ అక్కినేని ఇప్పటికీ నవయువకుడిలా మాట్లాడడం,నటించడం అది తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం….