Daily Archives: June 8, 2013

కార్పరేట్ గణేష్

imagesఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న కామెడి వేషాల స్థాయి నుండి ఇలా ప్రొడ్యూసర్ గా ఎదిగిన గణేష్ ఈ మధ్య బడా సినిమాలను నిర్మిస్తూ బడా నిర్మాతగా ఎదిగిపోయారు. అయితే త్వరలో బండ్ల గణేష్ కాస్త కార్పోరేట్ గణేష్ కానున్నాడని ఇండస్ట్రీలో చెబుతున్నారు.ఇంతకీ విషయం ఏమిటంటే ప్రస్తుతం సినీ ప్రపంచంలోకి కార్పోరేట్ కంపెనీలు కూడా అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలోనే  ప్రముఖ కోళ్ల పరిశ్రమ వెంకటేశ్వర హ్యాచరీస్ కూడా రంగప్రవేశం చేస్తోంది. ఈ సంస్థ అధినేత బాలాజీరావు ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు హీరోలతో పరిచయాలు పెంచుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.ఇక టాలీవుడ్ లో కూడా పాగా వేయాలని సదరు సంస్థ ఆలోచింస్తుందట. అందుకు ఇక్కడ మంచి ఫాంలో ఉన్న నిర్మాత అయిన గణేష్ ను ఈమేరకు కూడా కలిసి చర్చించారట. ఈ మధ్యనే పూణేలోని సంస్థ హెడ్ ఆఫీస్ కు వెళ్ళిన గణేష్ తో చర్చించి తెలుగు ‘బాద్ షా’ను హిందీలో రీమేక్ చేయాలని భావించారట. అంతేకాదు తెలుగులో తమ సంస్థ బాధ్యతలను గణేష్ కే అప్పగించాలని నిర్ణయించారట.