Daily Archives: June 29, 2013

ఆమెను మంచు ఫ్యామిలీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు …

Oru-Kal-Oru-Kannadi_movieఈ యాపిల్ ఎవరనుకుంటున్నారా?, అదేనండి దేశ ముదురుతో రోమాన్స్ చేసి కాస్త బొద్దుగా తయారయి, తమిళంలోకి వెళ్లి జూనియర్ కుష్భూగా సెటిల్ అయిన పిల్ల గురించే. ఈ పాటికే అర్ధమై ఉంటుంది. బొద్దుగుమ్మ హన్సికను మంచు ఫ్యామిలీ నిబద్దత అంటే ఈ అమ్మాయిని చూసే నేర్చుకోవాలి అంటూ తెగ పొగిడేస్తున్నారు.అసలు విషయం ఏంటంటే హన్సిక ప్రస్తుతం మంచు ఫ్యామిలీ సినిమా ‘గోల్ మాల్ 3’ రీమేక్ లో నటిస్తుంది. ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. ఈ షూటింగులో ఉండగానే  హన్సిక అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకుంది. తక్కువ రోజుల్లోనే ఆరోగ్యం కుదుటపడటంతో, వెంటనే సెట్స్ కు వచ్చేసి షూటింగులో పాల్గొందట. అందుకే మంచు అండ్ కో ఇప్పుడు హన్సిక చాల గ్రేట్ అంటూ మోసేస్తున్నారు. ఒక్క మంచు ఫ్యామిలీనే కాదు అమ్మడి డిడికేషన్ చూసిన సహ నటులు, చిత్రం యూనిట్ సభ్యులు హన్సిక డెడికేషన్ కు తెగ ముచ్చట పడిపోతున్నారట

మెగా ఆఫర్ కొట్టేసిన గోపీచంద్ …

malineni-gopichand-allu-arjబ‌లుపు సినిమా హిట్టో, ఫ‌ట్టో ఇంకా తేల‌లేదు. కానీ ఆ సినిమా ద‌ర్శకుడు గోపీచంద్ మ‌లినేని పంట మాత్రం పండింది. త్వర‌లోనే మెగా హీరో అల్లు అర్జున్‌ తో సినిమా తీయ‌బోతున్నాడ‌ట‌. సింహాలాంటి బ్లాక్ బ‌స్టర్ మూవీ అందించిన ప‌రుచూరి ప్రసాద్ ఈ సినిమాని తెర‌కెక్కిస్తార‌ట‌. గోపీచంద్‌ తో జ‌త క‌ట్టడానికి మెగా హీరో కూడా రెడీగానే ఉన్నాడ‌ని స‌మాచార‌మ్‌. ప్రస్తుతం ‘రేసుగుర్రం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు బ‌న్నీ. త్వర‌లోనే బ‌లుపు సినిమా చూస్తాడ‌ట‌. అందులో గోపీచంద్ మేకింగ్ స్టైల్ చూసి, త‌న నిర్ణయం ప్రక‌టించే అవ‌కాశం ఉంది. బ‌న్నీతో గ‌నుక ఛాన్స్ అందుకొంటే గోపీచంద్ మ‌లినేనికి బంప‌ర్ ఆఫర్ త‌గిలిన‌ట్టే.

బాలయ్య ఫై రవితేజా సెటైర్స్

imagesఏదో ఓ హీరోతో ఆడుకోవ‌డం ఈమ‌ధ్య సినిమా వాళ్లకు మ‌రీ ఫ్యాష‌నైపోయింది. మొన్న యాక్షన్ త్రీడీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ ని హ‌ర్ట్ చేశారు. ఇప్పుడు బ‌లుపులో బాల‌య్య ఫ్యాన్స్‌ తో ఆడుకొన్నారు. ర‌వితేజ‌-గోపీచంద్ మ‌లినేని క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం బ‌లుపు. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో – ర‌వితేజ బాల‌కృష్ణ మాడిలేష‌న్‌ లో మాట్లాడాడు. అంత వ‌ర‌కూ బాగానే ఉంది. అయితే అర్థం ప‌ర్థం లేని పదాల‌తో, స‌రిగా లేని వాక్య నిర్మాణాల‌తో ఎక్కడో మొద‌లెట్టి, ఇంకెక్కడో ముగించి ఏదోదో మాట్లాడ‌డం బాల‌య్య ఫ్యాన్స్ కి న‌చ్చలేదు. ఎందుకంటే బ‌హిరంగ వేడుక‌ల్లో బాల‌కృష్ణ స్పీచ్ అలాగే ఉటుంది. ఇది కేవ‌లం త‌మ హీరోని అవ‌మానించ‌డానికే అని నంద‌మూరి ఫ్యాన్స్ బాగా పీల‌వుతున్నారు. ఈ స‌న్నివేశం.. బలుపుకి ప్లస్ అనుకొంటే – అదే మైన‌స్ అయి కూర్చుంది. మ‌రి నంద‌మూరి ఫ్యాన్స్ ఫీలింగ్స్‌ని ఈ బ‌లుపు టీమ్ ఎంత వ‌ర‌కూ అర్థం చేసుకొంటుందో చూడాలి.

Mahesh Babu One Okkadine New Still

Maheshbabu-1movie-stills

Samantha at Se La Vie Exhibition Inauguration