Blog Archives

మారుతి బన్నీ తో సినిమా చేస్తాడా?

imagesప్రతిభ ఎక్కడుంటే అక్కడ‌… ప్రత్యక్షమైపోయి వారిని క‌లుపుకుపోవ‌డంలో మెగా ఫ్యామిలీ ముందుంటుంది. అందునా.. అల్లు అర‌వింద్‌. ఆయ‌న దృష్టి ఇప్పుడు మారుతిపై ప‌డింది. ఈరోజుల్లో సినిమా హిట్టు కొట్టిన వెంట‌నే – మారుతి చేతిలో అడ్వాన్స్ పెట్టేశారు. భ‌విష్యత్తు అవ‌స‌రాల నిమిత్తం. మారుతి కూడా మెగా ఫ్యామిలీలో ఒక‌డిగా పెరిగాడు కాబట్టి, ఆ కన్సర్న్‌తో ఎంత‌మంది అవ‌కాశాలిచ్చినా, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కొత్తజంట సినిమాకు శ్రీ‌కారం చుట్టాడు. ఈ సినిమా క‌థ విష‌యంలో మారుతి చూపిస్తున్న శ్రద్ధ, త‌ప‌న అల్లు అర‌వింద్‌కి బాగా న‌చ్చేశాయ‌ట‌. దాంతో బ‌న్నీతో కూడా ఓ సినిమా చేసి పెట్టమ‌నే ప్రపోజ‌ల్ తీసుకొచ్చారాయ‌న‌.

బ‌న్నీ, మారుతికి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ఈరోజుల్లో సినిమా ప్రమోష‌న్‌లో పాల్గొని, ఆ సినిమాకి కావ‌ల్సినంత ప‌బ్లిసిటీ వ‌చ్చేలా చేశాడు బ‌న్నీ. ఇప్పుడు అదే బ‌న్నీతో సినిమా చేయమంటే మారుతి కాదంటాడా?? హ్యాపీగా ఒప్పేసుకొన్నాడు. అటు అల్లు అర్జున్‌, ఇటు మారుతి చేతి నిండా క‌మిట్‌మెంట్స్తో తో బిజీ బిజీగా ఉన్నారు. ఆ సినిమాల‌న్నీ పూర్తయ్యాకే ఈ కాంబినేష‌న్ సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి. ఒక‌వేళ కొత్తజంట హిట్టయిపోయి, శిరీష్ హిట్ హీరో అయిపోతే – బ‌న్నీ సినిమా కూడా ఆ ఊపులోనే మొద‌లైపోయినా షాక్ తిన‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

 

చెర్రీ కొత్త సినిమా పేరు చెర్రీ

cherrycharan-cherryసినిమా టైటిళ్ల గురించి పెద్దగా ఆలోచించ‌డం లేదు ద‌ర్శకులు. ఏది క్యాచీగా ఉంటే అదే పెట్టేస్తున్నారు. సినిమాకి సెట్ అవుతుందా? లేదా? అనికూడా ఆలోచించ‌డం లేదు. స‌ద‌రు హీరోకి ముద్దు పేరు ఉంటే అది టైటిల్ గా వ‌చ్చేస్తోంది. అల్లు అర్జున్ ముద్దు పేరు బ‌న్నీ. ఆ సినిమాతో వినాయ‌క్ సినిమా తీసేశాడు. ప్రభాస్‌ని అంద‌రూ డార్లింగ్ అనిపిలుస్తారు. ఆ సినిమా కూడా వ‌చ్చింది. ఇప్పుడు చ‌ర‌ణ్ మిగిలాడు. చ‌ర‌ణ్‌ని ఇంట్లోవాళ్లు, అభిమానులు ప్రేమ‌గా చెర్రీ అని పిలుచుకొంటున్నారు. ఇప్పుడు ఆ ముద్దు పేరే టైటిల్‌గా మార‌బోతోంది.కొర‌టాల శివ – చ‌ర‌ణ్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. బండ్ల గ‌ణేష్ నిర్మాత‌. ఈ సినిమాకి చెర్రీ అనే పేరు పెడితే ఎలా ఉంటుంది? అని చిత్రబృందం భావిస్తోంది. చ‌ర‌ణ్ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వ‌చ్చేసింది. ఇక అధికారికంగా ప్రక‌టించ‌డ‌మే మిగిలి ఉంది.

ఇదే వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్

varun-tejమెగా ఫ్యామిలీ నుండి హీరో గా తెరంగ్రేటం చేయడానికి సిద్దంగా వున్నాడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి క్లీన్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చిత్రంతో వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు వరుణ్. ఇందుకోసం కధా చర్చలు కూడా జరిగిపోయాయి.‘గొల్ల భామ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఈ చిత్రం కోసం వరుణ్ టోటల్ గెటప్ తో రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ లుక్ కు సంభందించి న ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో లో రఫ్ లుక్ తో ఆలరిస్తున్నాడు వరుణ్. తన తొలి సినిమా కోసమే ఇలా గడ్డం పెంచి ఉంటాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రం సంభందించిన షూటింగ్ ప్రారంభం కానుంది.

మెగా ఫ్యామిలీకి ఎదురులేదు….