Blog Archives

బాబు ని అభినిం దించిన అక్కినేని …

cbn-anrమాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ను ప్రముఖ సినీనటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కలిసారు. వేరెవ్వరూ స్పందించని రీతిలో ఉత్తరాఖండ్ విషయంలో చంద్రబాబు స్పందించిన తీరును ఆయన ప్రస్తుతించారు. బాధితులను పరామర్సించటం లోనూ, వారికి కావలసిన ఏర్పాట్లు చేయటం లోనూ, తెలుగువారిని డెహ్రాడూన్ నుంచి వారి వారి స్వస్థలాలకు తరలించటం లోనూ చంద్రబాబు ఎంతో బాధ్యతగా ప్రవర్తించారని, ఇది నిజంగా అభినందనీయమని అక్కినేని చంద్రబాబును వ్యక్తిగతంగా కొనియాడారు. షుమారు అరగంటకు పైగా వారిరువురు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎటువంటి రాజకీయ చర్చలు రాలేదని, కేవలం వ్యక్తిగతమని పార్టీ వర్గాలు తెలిపాయి.

దేవదాసుకి కు షష్టిపూర్తి…

anrdevadasuకొన్ని కథలు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తాయి..ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తాయి. అలా వెండితెర మీద 14 సార్లు ఆవిష్కరింపబడిన అరుదైన కథ దేవాదాసు.. దాదాపు భారతీయ భాషలన్నింటిలో తెరకెక్కిన దేవాదాసు తెలుగు వెండితెర మీద ఆవిష్కరింపబడి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ చిత్ర విశేషాలు తెలుసుకుందాం..దేవదాసు పాత్ర అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అక్కినేని నాగేశ్వర్రావు.. అవును అసలు దేవాదాసు ఇలాగే ఉంటాడేమో అనేంత బాగా నటించారు ఆయన.. శరత్  రాసిన నవలా నాయకున్ని కళ్లకు కట్టినట్టుగా మన ముందు ఆవిష్కరించారు..

ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో పాత్ర పార్వతి.. ఈ పాత్రల్లో ఎంతో హుందాగా ఓదిగిపోయింది సావిత్రి.. జానకీ చేయాల్సిన పాత్ర అదృష్టం కొద్ది సావిత్రిని వరించటంతో ఆ అవకాశాన్ని ఎంతో బాగా ఉపయోగించుకుంది.. 17 ఏళ్ల వయసులోనే తను తప్ప మరెమరూ ఆ పాత్రకు అంతగా న్యాయం చేయలేరేమో అనేంత బాగా నటించి మెప్పించింది.

తెలుగులో అక్కినేని నటించిన దేవదాసు రిలీజ్‌ నాడే, పోటీగా సైగల్ నటించిన హిందీ దేవదాసును విడుదల చేశారు బాలీవుడ్‌ నిర్మాతలు.. అయినా తెలుగు దేవాదాసు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.. అంతేకాదు భారతీయ చరిత్రలోనే అన్ని దేవాదాసుల కంటే ఏఎన్నార్‌ హీరోగా నటించిన దేవాదాసే భారీ విజయం సాదించింది.

1951 నవంబర్ 24న మద్రాసులోని రేవతి స్టూడియోలో రాత్రి 8 గంటలకు దేవదాసు షూటింగ్ ప్రారంభమైంది. ఎంత మంది వద్దు అంటున్నా .. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఎలాగైనా ఈ సినిమా పూర్తి చేయాలనే దృడ సంకల్పంతో సినిమా ప్రారంబించారు నిర్మాత  ద్రణావధ్యుల లక్ష్మీ నారాయణ..నిర్మాత లక్ష్మీ నారాయణ గారు అంత సాహసం చేయటం వెనుక కారణం లేకపోలేదు.. దేవాదాసు కథ అప్పటికే బాలీవుడ్‌ తెర మీద మంచి సక్సెస్‌ సాదించింది.. అంతకు మించి దర్శకులు వేదాంతం రాఘవయ్యగారు భారీ బరోసా ఇవ్వటంతో నిర్మాత నిశ్చింతగా ఉన్నారు..

ఇక ఈ చిత్రానికి మరో ఎసెట్‌ సీనియర్‌ సముద్రాల.. ఈ సినిమాకు మాటలు పాటలు అందించిన సముద్రాల ప్రతీ అక్షరంలోనూ తన మార్క్‌ చూపించారు.. అంతేకాదు ఈ సినిమాలో ఉన్న పదకొండు పాటలూ ఆయనే రాయడం విశేషం..తెలుగులో అక్కినేని నటించిన దేవదాసు రిలీజ్‌ నాడే, పోటీగా సైగల్ నటించిన హిందీ దేవదాసును విడుదల చేశారు బాలీవుడ్‌ నిర్మాతలు.. అయినా తెలుగు దేవాదాసు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.. అంతేకాదు భారతీయ చరిత్రలోనే అన్ని దేవాదాసుల కంటే ఏఎన్నార్‌ హీరోగా నటించిన దేవాదాసే భారీ విజయం సాదించింది.

 

వందేళ్ళ సినిమా వేడుకలకు వేదిక కాబోతున్న టాలీవుడ్

Indian-Cinema-Completes-100-Years--1913-To-2013--1724భారతీయ సినిమా వందసంవత్సరాల పండుగను మన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ అత్యంత ఘనంగా 20 కోట్ల రూపాయల ఖర్చుతో జరపడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈమధ్యనే ముగిసిన ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ కమిటి మీటింగ్ లో దీనికి సంబంధించి కీలక నిర్ణయమ తిసుకునట్లుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా ఈ ఉత్సవాలు మన రాజధానిలో కూడా జరపాలా లేదా అన్న విషయంలో నెలకొన్న అస్థిరతకు క్లారిటీ ఏర్పడింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ వ్యక్తులు దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరధ్వాజ్ ల ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ఒక కమిటీ ఏర్పడి రామోజీ ఫిల్మ్ సిటీ లో కాని గచ్చిబౌలి స్టేడియం లో కాని ఈ ఉత్సవాలు అత్యంత చిరస్మరనియంగా జరపడానికి ఏర్పాట్లు జరుగుతాయని ఫిల్మ్ చాంబర్ అఫ్ కామర్స్ కమిటీ మెంబర్ చదలవాడ శ్రీనివాసరావు ద్వారా తెలుస్తోంది.

తెలుగు సినిమాకు చిరస్మరనియమైన సేవలు అందించిన రఘుపతి వెంకయ్యనాయుడు, ఎల్వి ప్రసాద్, కెవి రెడ్డి, బిఎన్ రెడ్డి లాంటి ప్రముఖులతో పాటు ఎందరో తెలుగు సినిమా సెలబ్రిటీల సేవలను గుర్తించుకొనే విధంగా ఈ ఉత్సవాలు ఉంటాయని నిర్వాహకులు చెపుతున్నారు. అలాగే రాజమండ్రి లో నిర్మింపబడిన మొట్టమొదటి స్టూడియో, విజయవాడలో నిర్మింపబడిన అతి పురాతమైన మారుతి ధియేటర్ల ప్రస్తావన కూడా ఈ ఉత్సవాలలో ఉంటుందని చెపుతున్నారు. అదే విధంగా తెలుగు సినిమా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన ఎన్టిఆర్, ఏఎన్ఆర్ ల కృషి కి నిరాజనంగా ఈ ఉత్సవాలను అంకితం చేయబోతున్నట్లు నిర్వాహకులు చెపుతున్నారు. దక్షినాది పరిశ్రమకు చెందిన ఎందరో తమిళ, మళయాళ, కన్నడ నటినటులతో పాటు హిందీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను కూడా ఒకే వేదికపై తీసుకువచ్చే అపురూప ఉత్సవాలుగా ఈ వందేళ్ళ సినిమా పండుగను చేయబోతున్నట్లు నిర్వాహ కమిటీ తెలుపుతోంది.

దీనికి తోడు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఉత్సవాల పట్ల ముఖ్య శ్రద్ధ తీసుకోవడమే కాకుండా 5 కోట్ల గ్రాంట్ ను కూడా విడుదల చేస్తునట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన తెలుగు సినిమా వజ్రోత్సవాల రచ్చలా  కాకుండా మన తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింప చేసే విధంగా ఎ ఉత్సవాలు జరగాలని మన తారామణులు అందరూ వాళ్ళ ఇగో లను పక్కకు పెట్టి ఈ ఉత్సవాలను విజయవంతం చేయడానికి సహకరిస్తారని, మన తెలుగు సినిమా ఖ్యాతిని భారతదేశం యావత్తూ చెప్పుకొనే విధంగా ఈ ఉత్సవాలు జరగాలని, తెలుగు సినిమాను అభిమానించే ప్రతి తెలుగు హృదయం కోరుకుంటోంది.

 

మరో చరిత్ర సృష్టించిన ”మాయాబజార్”

images (2)వందేళ్ళ సినిమా చరిత్రలో మన తెలుగు సినిమా రికార్డు సృష్టించింది .వందేళ్ళ భారతీయ సినిమా చరిత్రలో అపురూప చలనచిత్ర దృశ్య కావ్యంగా మన ” మాయాబజార్ ” సినిమా సగర్వంగా నిలిచింది. దేశంలోని ఇతర భాషా చిత్రాలన్నిటి లోనూ ‘ మాయాబజార్ ‘ అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. 1957 లో విడుదలయిన ఈ చిత్రాన్ని విజయా బ్యానర్ పై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించగా, కె. వి. రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కన్నడ, తమిళ భాషల్లో కూడా అనువదించారు. జాతీయ వార్తా చానెల్ ” సి ఎన్ ఎన్ – ఐ బి ఎన్ ” నిర్వహించిన పోల్ లో ” మాయాబజార్ ” తొలిస్థానం దక్కించుకుంది. ఇది తెలుగువారందరికీ గర్వకారణంగా చెప్పుకోదగ్గ  అంశంగా పేర్కొనవచ్చు. భారతం లోని ఒక చిన్న కథను ఇతివృత్తంగా తీసుకుని  నిర్మించిన ఈ చిత్రంలో నటీనటుల ప్రతిభ, దర్శక నైపుణ్యం, సంగీతం, కెమెరా పనితనం, ఎడిటింగ్ లాంటి అన్ని అంశాలు అద్భుతంగా సమకూరాయి. అప్పట్లోనే మల్టీ స్టారర్ గా పేరొందిన ఈ చిత్రంలో ఆ నాటి అగ్ర హీరోలు ఎన్. టి. ఆర్., అక్కినేని కలిసి నటించగా ఘటోత్కచుడిగా ఎస్వీ రంగారావు ఒక ప్రధానపాత్రలో నభూతో నభవిష్యతి గా నటించారు. స్వర్గీయ ఘంటసాల సంగీత దర్శకత్వంలో అన్ని సూపర్ హిట్ పాటలు కాగా, ఈ సినిమాకు ఆయన సమకూర్చిన రి-రికార్డింగ్ హైలైట్ గా చెప్పుకోవచ్చు.ఆ సినిమాలో నటించన నటులు ఎవ్వరూ ఇప్పుడు మన మన మధ్య లేకపోయినా వారందరి ప్రతినిధి గా అక్కినేనిఒక్కరూ మన మద్యన ఉండటం మన అదృష్తం ..