Blog Archives

దేవదాసుకి కు షష్టిపూర్తి…

anrdevadasuకొన్ని కథలు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తాయి..ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తాయి. అలా వెండితెర మీద 14 సార్లు ఆవిష్కరింపబడిన అరుదైన కథ దేవాదాసు.. దాదాపు భారతీయ భాషలన్నింటిలో తెరకెక్కిన దేవాదాసు తెలుగు వెండితెర మీద ఆవిష్కరింపబడి 60 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ చిత్ర విశేషాలు తెలుసుకుందాం..దేవదాసు పాత్ర అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అక్కినేని నాగేశ్వర్రావు.. అవును అసలు దేవాదాసు ఇలాగే ఉంటాడేమో అనేంత బాగా నటించారు ఆయన.. శరత్  రాసిన నవలా నాయకున్ని కళ్లకు కట్టినట్టుగా మన ముందు ఆవిష్కరించారు..

ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన మరో పాత్ర పార్వతి.. ఈ పాత్రల్లో ఎంతో హుందాగా ఓదిగిపోయింది సావిత్రి.. జానకీ చేయాల్సిన పాత్ర అదృష్టం కొద్ది సావిత్రిని వరించటంతో ఆ అవకాశాన్ని ఎంతో బాగా ఉపయోగించుకుంది.. 17 ఏళ్ల వయసులోనే తను తప్ప మరెమరూ ఆ పాత్రకు అంతగా న్యాయం చేయలేరేమో అనేంత బాగా నటించి మెప్పించింది.

తెలుగులో అక్కినేని నటించిన దేవదాసు రిలీజ్‌ నాడే, పోటీగా సైగల్ నటించిన హిందీ దేవదాసును విడుదల చేశారు బాలీవుడ్‌ నిర్మాతలు.. అయినా తెలుగు దేవాదాసు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.. అంతేకాదు భారతీయ చరిత్రలోనే అన్ని దేవాదాసుల కంటే ఏఎన్నార్‌ హీరోగా నటించిన దేవాదాసే భారీ విజయం సాదించింది.

1951 నవంబర్ 24న మద్రాసులోని రేవతి స్టూడియోలో రాత్రి 8 గంటలకు దేవదాసు షూటింగ్ ప్రారంభమైంది. ఎంత మంది వద్దు అంటున్నా .. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఎలాగైనా ఈ సినిమా పూర్తి చేయాలనే దృడ సంకల్పంతో సినిమా ప్రారంబించారు నిర్మాత  ద్రణావధ్యుల లక్ష్మీ నారాయణ..నిర్మాత లక్ష్మీ నారాయణ గారు అంత సాహసం చేయటం వెనుక కారణం లేకపోలేదు.. దేవాదాసు కథ అప్పటికే బాలీవుడ్‌ తెర మీద మంచి సక్సెస్‌ సాదించింది.. అంతకు మించి దర్శకులు వేదాంతం రాఘవయ్యగారు భారీ బరోసా ఇవ్వటంతో నిర్మాత నిశ్చింతగా ఉన్నారు..

ఇక ఈ చిత్రానికి మరో ఎసెట్‌ సీనియర్‌ సముద్రాల.. ఈ సినిమాకు మాటలు పాటలు అందించిన సముద్రాల ప్రతీ అక్షరంలోనూ తన మార్క్‌ చూపించారు.. అంతేకాదు ఈ సినిమాలో ఉన్న పదకొండు పాటలూ ఆయనే రాయడం విశేషం..తెలుగులో అక్కినేని నటించిన దేవదాసు రిలీజ్‌ నాడే, పోటీగా సైగల్ నటించిన హిందీ దేవదాసును విడుదల చేశారు బాలీవుడ్‌ నిర్మాతలు.. అయినా తెలుగు దేవాదాసు ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.. అంతేకాదు భారతీయ చరిత్రలోనే అన్ని దేవాదాసుల కంటే ఏఎన్నార్‌ హీరోగా నటించిన దేవాదాసే భారీ విజయం సాదించింది.