Blog Archives

సీతమ్మ స్టైల్ మారాలి

download_176సీతమ్మ’గా తెలుగువారి హృదయాల్లో తిష్ఠ  వేసిన కథానాయిక అంజలి తన నటనతో బాగానే తెలుగు ప్రేక్షకులను కట్టడి చేసింది. ఆ మధ్య మిస్సింగ్ ఎపిసోడ్ తో ఇంకా బాగా పాపులర్ అయింది. ఆమె నటనతో బాగా పేరుతో పాటు ఆ విధంగా కూడా మంచి పాపులారిటీ కొట్టేసింది. అంజలి తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుం’జర్నీ’ సినిమా నుండే అంజలి నటన విషయం ప్రూవ్ అయింది. సీతమ్మ సినిమాలో అమాయక అమ్మాయిగా మెప్పించేసింది. అయితే ఆ సినిమాలలో పాత్ర స్వభావం దృష్ట్యా అంజలి వాయిస్ అక్షరాల సెట్ అయింది. అయితే అంజలి తాజా సినిమా ‘బలుపు’ సినిమాలో ఆమె డాక్టర్ పాత్రలో కనిపించినా ఆమె వాయిస్ లో మాత్రం అదే నాటు కనిపిస్తుంది.’బలుపు’లో అంజలి మాటలను విన్న అందరికీ ఈమె మారదా?, వాయిస్ మార్చుకొదా? అని అందరూ ప్రశ్నించుకున్నారు. రేపు ఏదైనా మోడరన్ పాత్రలో నటిస్తే ఇలానే అయితే డబ్బింగ్ వేరే వారి చేత చెప్పించాల్సి వస్తుంది. ఏది ఏమైనా టాలీవుడ్ సీతమ్మ ఇంకా కొన్ని విషయాలలో మారాలని బలుపు సినిమా ద్వారా అర్ధమయింది.

 

మెగా ఆఫర్ కొట్టేసిన గోపీచంద్ …

malineni-gopichand-allu-arjబ‌లుపు సినిమా హిట్టో, ఫ‌ట్టో ఇంకా తేల‌లేదు. కానీ ఆ సినిమా ద‌ర్శకుడు గోపీచంద్ మ‌లినేని పంట మాత్రం పండింది. త్వర‌లోనే మెగా హీరో అల్లు అర్జున్‌ తో సినిమా తీయ‌బోతున్నాడ‌ట‌. సింహాలాంటి బ్లాక్ బ‌స్టర్ మూవీ అందించిన ప‌రుచూరి ప్రసాద్ ఈ సినిమాని తెర‌కెక్కిస్తార‌ట‌. గోపీచంద్‌ తో జ‌త క‌ట్టడానికి మెగా హీరో కూడా రెడీగానే ఉన్నాడ‌ని స‌మాచార‌మ్‌. ప్రస్తుతం ‘రేసుగుర్రం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు బ‌న్నీ. త్వర‌లోనే బ‌లుపు సినిమా చూస్తాడ‌ట‌. అందులో గోపీచంద్ మేకింగ్ స్టైల్ చూసి, త‌న నిర్ణయం ప్రక‌టించే అవ‌కాశం ఉంది. బ‌న్నీతో గ‌నుక ఛాన్స్ అందుకొంటే గోపీచంద్ మ‌లినేనికి బంప‌ర్ ఆఫర్ త‌గిలిన‌ట్టే.

టాలీవుడ్ లో సినిమా తొలకరి జల్లులు

iddharammailathoమండే ఎండల నుండి నెమ్మది నెమ్మదిగా రాష్ట్రం తొలకరి జల్లుల వైపు పయనిస్తోంది. సమ్మర్ సినిమాలుగా హవా సృస్టిస్తాయి అనుకున్న చాలా సినిమాలు తొలకరి జల్లులులా జూన్ మొదటి వారంలో ఒకేసారి జూన్ 7 వ తారీఖున ఒక సినిమాపై మరొక సినిమా పోటిగా దిగిపోతున్నాయి. బన్నీ ఇద్దరమ్మాయిలతో సినిమా క్లారిటీ రావడంతో ఈ సినిమా తొలకరి జల్లులకు లైన్ క్లియర్ అయింది. శ్రియ పవిత్ర, ఛార్మి ప్రేమ ఒక మైకం, మహేష్ బాబు బావ ప్రేమకధా చిత్రం, అల్లరోడి యాక్షన్ 3డి ఇలా ఒకే వారంలో దిగుమతి అయి పోతుంటే, మేముకూడా రెడీ అంటూ సిద్ధార్ద్ హీరోగా చేసిన సమ్ థింగ్ సమ్ థింగ్, దర్శకేంద్రుడి సృష్టి ఇంటింటా అన్నమయ్య, మరో సీతమ్మ వాకిట్లో సినిమా రేంజి లో ఉంటుందా అనిపిస్తున్న మల్లెల తీరంలో సినిమాల విడుదల కు జూన్ రెండవ వారాన్ని ఎంచుకున్నాయి. కేవలం 15 రోజులలో దాదాపు 8 సినిమాలు ఒకేసారి ప్రేక్షకులపై దాటి చేస్తూ ఉండడంతో 150 కోట్ల పెట్టుబడి తో తీసిన ఈ ఎనిమిది చిన్న సినిమాలలో ఏ సినిమా నిలబడుతుందో అనే ఆశక్తి టాలీవుడ్ లో చర్చనియాంశం గా మారింది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే హాట్ సమ్మర్ కు రావలసిన ఈ సినిమాలు అన్నీ తొలకరి జల్లులులా జూన్ లో రావడం విశేషం.

గాయకుడి గా మారిన రవితేజ

images (2)బ‌లుపు సినిమాకి ఇంకో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ చేరిందా? ల‌క్ష్మీరాయ్ తో ఓ అయిట‌మ్ సాంగ్ చేయించి నీర‌సంగా ఉన్న ఈ సినిమాకి ఓ కిక్ ఇచ్చారు. ఇప్పుడు మ‌రి కాస్త జోష్ జోడించాల‌నుకొంటున్నారా?? ఈ ప్రశ్నల‌కు ఫిల్మ్‌న‌గ‌ర్ అవును… అనే స‌మాధానం చెబుతోంది. బ‌లుపు సినిమాలో ర‌వితేజ ఓ పాట పాడాడ‌ట‌. ఈ పాట మొత్తం ‘బ‌లుపు’ ఆల్బమ్‌ కే ప్రత్యేక ఆకర్షణ‌గా నిలుస్తుంద‌ని చిత్రబృందం చెబుతోంది. ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తయ్యింది. త‌మ‌న్ సంగీతం అందించారు. జూన్ మొద‌టి వారంలో హైద‌రాబాద్‌ లో బ‌లుపు పాట‌ల్ని విడుద‌ల చేస్తారు. మ‌రి గాయ‌కుడిగా ర‌వితేజ ఎన్ని మార్కులు తెచ్చుకొంటాడో ఏమిటో చూడాలి ..

నాగార్జున-రవితేజ ఏమంటారో….?

Nagarajuna-And-Ravi-Teja-1130ఆదివారం నాడు భాద్ షా ఆడియో విడుదల కార్యక్రమం లో జరిగిన దురద్రుష్టకర సంఘటన పై టాలీవుడ్ ప్రముఖుల స్పందన మొదలైంది. ఇటువంటి ఆడియో వేడుకలకు భవిష్యత్ లో తాను అతిధిగా వెళ్లనని దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రకటించారు. అదే విధంగా చాలామంది టాలీవుడ్ ప్రముఖులు ఇంత భారీ స్థాయిలో ఆడియో వేడుకలు నిర్వహించడం మానుకుంటే బాగుంటుందని పెద్ద హీరో సినిమాల నిర్మాతలకు సూచిస్తున్నారు. మీడియా కూడా ఈ సంఘటనపై చాలా తీవ్రంగా ప్రతిస్పధించింది. కనీసం మంచి నీళ్ళు లాంటి సౌకర్యాలు కూడా కలగాజేయకుండా ఎక్కడ నుంచో వచ్చిన హీరోల అభిమానులను కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఇలా పోలీస్ ల చేత చిథకబాదుడు కొట్టించడం ఏమిటి ? అంటూ వార్తలు రాస్తున్నాయి. ఈ నేపధ్యంలో త్వరలో జరగబోతున్న నాగార్జున “గీకువీరుడు”, రవితేజ “బలుపు” సినిమాల ఆడియో వేడుకలు ఎలా నిర్వహిస్తారు? అన్న ప్రశ్న ఉదయిస్తోంది. కాని పెద్ద సినిమాల నిర్మాతలు మాత్రం రోడ్ మీద ప్రమాదం జరిగిందని ప్రయాణాలు మానుకుంటామా? అని అంటూ ఏదావిధి గానే ఈ కార్యక్రమాలు ఉంటాయి అని అంటున్నారట. మరీ దీనికి హీరోలు నాగార్జున,రవితేజ లు ఏమంటారో చూడాలి…..

మాస్ మహారాజా లిఫ్ట్ శేషుకి పనికివస్తుందా?

“ఖర్మ” చిత్రంలో హీరోగా నటించి ఆ తరువాత అంతగా అవకాశాలు లేక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “పంజా” సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ చేసిన అడవి శేషు గుర్తుండి వుండాలి. ఈ సినిమా అంతగా విజయవంతం కాకపొయినా శేషు కు మాత్రం మంచి నటుడిగా పేరు తెచ్చిపెట్టింది. శేషు లో ఉండే ప్రతిభను గుర్తించి రవితేజ తను నటిస్తున్న “బలుపు” సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రకు అడవి శేషు పేరును సుచించాడట.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో మరో రొమాంటిక్ లవ్ స్టొరీ సినిమాలో కూడా శేషు హీరోగా నటించాబోతున్నాడని తెలుస్తోంది.