Blog Archives

హలో బ్రదర్ అటక ఎక్కింది

Naga-Chaitanyaస్టార్ హీరోల కొడుకు హీరోలయితే, తండ్రులు చేసిన సినిమాలను వాళ్లతో రీమేక్ చేసెయ్యాలని తెగ ఉబలాటపడుతుంటారు మన దర్శకులు. తీసిన సినిమానే మళ్లీ తీస్తున్నా కూడా కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు మన నిర్మాతలు. మీ నాన్నగారి సినిమాల్లో దేని రీమేక్ లో నటించాలని ఉంది అని అడిగితే నాగార్జున చాలాసార్లు చెప్పాడు… ఆనాటి ఆణిముత్యాలని అలా ఉండనివ్వడమే మంచిది, వాటి జోలికి పోయి చెడగొట్టడం కరెక్ట్ కాదు అని. నిజంగానే నాగార్జున అలాంటి ప్రయోగాల జోలికి పోలేదు. కానీ అతడి కొడుకు మాత్రం ఆ సాహసం చేయడానికి రెడీ అయిపోయాడు. మరీ గీతాంజలి లాంటి మాస్టర్ పీస్ జోలికి పోలేదు కానీ, హలోబ్రదర్ రీమేక్ లో నటించేందుకు సిద్ధపడ్డాడు.

నిజానికి ఈ సినిమా కూడా తీసిపారేయాల్సిందేమీ కాదు. అప్పట్లో మాంచి సక్సెస్ అయ్యింది. తేలికగా చేసెయ్యదగినది కూడా కాదు. ఇద్దరు హీరోలు. ఒకరు మాస్, ఇంకొకరు క్లాస్. రెండిటినీ సమానంగా పోషించగలగాలి. ఏ ఒక్కటి డౌన్ అయినా ఫీల్ దెబ్బతింటుంది. సినిమా ఫ్లాపవుతుంది. నాగార్జున రెండు పాత్రలనీ ఇరగదీశాడు. అందుకే ఇప్పటికీ టీవీలో ఆ సినిమా వస్తుంటే జనం చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి సినిమాని నాగచైతన్యతో రీమేక్ చేయాలని అనుకున్నాడు ఢమరుకం దర్శకుడు శ్రీనివాసరెడ్డి. డి.శివప్రసాద్ రెడ్డి నిర్మాతగా ముందుకొచ్చారు. కానీ ఇద్దరికీ ధైర్యం చాలక ఆ సినిమాను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. దానికి ముఖ్య కారణం నాగచైతన్యేనట. ఇంతవరకూ హీరోగా సక్సెస్ కాకపోవడం, అతడి మార్కెట్ బాగా డౌన్ లో ఉండటం వల్ల అతడితో ఇలాంటి ప్రయోగం చేయడం మంచిది కాదు అనిపించి హలోబ్రదర్ ని పక్కన పెట్టేసి వేరే కథకోసం వెతుకుతున్నారని తెలిసింది. అంతేనా లేక తన హిట్ సినిమాని చెడగొట్టొద్దని నాగార్జున గానీ చెప్పాడా!

అఖిల్ ఎంట్రీ ని షురూ చేసిన నాగార్జున

akhil

మొన్న శనివారం రాజధాని లో జరిగిన “అడ్డా” సినిమా ఆడియో వేడుకలో నాగార్జున అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ని అధికారికంగా ప్రకటించాడు. అడ్డా ఆడియో వేడుకలో అతిధిగా పాల్గొన్న నాగ్ మాట్లాడుతూ, వచ్చే సంవత్సరం జరగబోయే అఖిల్ సినిమా ఆడియో వేడుకకు కూడా ఇంతకంటే ఎక్కువగా జనం రావాలి, అని నాగ్ చెప్పడంతో వచ్చే సంవత్సరమే అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందన్న విషయం స్పష్టం అయిపొయింది. ఇంతకీ ఈ సినిమాను ఎవరు దర్శకత్వం వహిస్తారు..? అన్న విషయంపై రకరకాల ఉహగాలు అప్పుడే మొదలు అయి పోయాయి. రాజమౌళి దర్శకత్వంలో అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది, అన్న ప్రచారం ఆ మధ్య జరిగినా, 2015 వరకూ రాజమౌళి బాహుబలి తోనే ఉంటాడు కాబట్టి అఖిల్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తాడు అన్న విషయం ఇక అధికారికంగా లేనట్లే.

ఇక పోతే ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ దర్శకులుగా వెలుగొందుతున్న వినాయక్, పూరి జగన్నాద్, శ్రీను వైట్ల లాంటి దర్శకుల వైపు నాగ్ మొగ్గు చుపుతాడా..? లేక క్రియేటివ్ దర్శకులుగా పేరుగాంచిన శేఖర్ కమ్ముల, శ్రీకాంత్ అడ్డాల లాంటి దర్శకుల చేతిలో అఖిల్ భవిష్యత్ ను నాగార్జున పెడతాడా..? అనే విషయాలపై ఎవరికి తోచిన ఉహాగానాలు వారు రాస్తున్నారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం విరేవ్వరు కాకుండా ఓ కొత్త దర్శకుడితో అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా 2014 సంవత్సరంలో టాలీవుడ్ కు మరో కొత్త హీరో రాబోతున్నడన్న విషయం స్పష్టం అయి పొయింది.

3 D లో నాగార్జున శివ సినిమా

imagesశివ‌… ఓ సంచ‌న‌లం! తెలుగు సినిమా చ‌రిత్రను రాయాల‌నుకొంటే – శివ‌కు ముందు, ఆ త‌ర‌వాత అని రాసుకోవాలేమో?! కెమెరా, లైటింగ్‌, టేకింగ్‌, డైలాగ్స్ – ఇలా అన్నిట్లోనూ కొత్త భాష్యం చెప్పిందీ సినిమా. నాగార్జున కెరీర్‌లోనే కాదు, తెలుగు సినిమాల్లోనే ఓ మైలురాయి. ఇప్పుడు ఈ సినిమాకి త్రీడీ వెర్షన్ రాబోతోందా? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ఆనాటి శివ‌ను ఇప్పుడు త్రీడీ హంగులు జోడించ‌బోతున్నారు. ఈ సినిమాని నాగ‌ చైత‌న్యతోనో, అఖిల్‌ తోనే రీమేక్ చేస్తే బాగుంటుంద‌ని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాగార్జున మాత్రం పాత సినిమానే త్రీడీ వెర్షన్‌ లో తీద్దామ‌నే నిర్ణయం తీసుకొన్నట్టు స‌మాచార‌మ్‌. ఇందుకు సంబంధించి నాగ్‌.. చ‌ర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

ముదురు గుమ్మలతో చైతూ

1371610482-1231990  ప్రాంతాలలో వచ్చిన నాగార్జున హలో బ్రదర్ అప్పట్లో ఒక సెన్సేషన్ . ఇప్పుడు మళ్ళి అదే సినిమాను అదే పేరుతో  నాగ చైతన్య హీరో గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే .ఆ సినిమా లోని కన్నెపెట్టరో కన్నుకొట్టరో..’ 90లలో యూత్‌ని రఫ్ ఆడించిన పాట ఇది. కింగ్‌ నాగార్జున కెరియర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌.  అప్పట్లో  ఆ పాట అంతగా ఫేమస్‌ అవ్వడానికి కారణం బాలు గాత్రం, కీరవాణి మ్యూజిక్‌ ఓ కారణం.  అంతకుమించి ఈ ముగ్గురు కన్నెపెట్టలు చేసిన రభస.  రంభ, ఆమని, ఇంద్రజ లాంటి అలనాటి   సెక్సీ ముద్దుగుమ్మలు నాగ్‌తో కలిసి తమ అందాలను ఆరబోస్తూ అద్దిరిపోయే స్టెప్పులేయడంతో ఆనాటి   యువత థియేటర్స్ లో డాన్స్ లు చేసింది.

ఇప్పుడదే పాటను నాగచైతన్య హీరోగా వస్తున్న ‘హలోబబ్రదర్‌’ రీమేక్‌లో రీమిక్స్‌ చేస్తున్నారు. ఈ రీమిక్సులో ముదురు కన్నెపెట్టలు శ్రీయ, ప్రియమణి,ఛార్మి లతో కలసి  చైతు స్టెప్స్ వేస్తాడట . ఇప్పటికే కలిసి ఛార్మి కూడా చైతూ కోసం స్టెప్పేస్తుందిట. మొదటి ఇద్దరు భామలు ఇప్పటికే ఈ ముగ్గురు ముదురు  హీరోయిన్ లు బుకింగ్ లు లేక ఐటమ్ భామలుగా మారిపోయారు. ఆన్ స్క్రీన్ ఇంకా చిన్న వాడిగా కనిపించే నాగ చైతన్య ఈ ముదురు భామల మధ్య ఐటమ్ సాంగ్ కు నప్పుతాడా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి ఈ సూపర్ హిట్ పాటను రీమిక్స్ చేసి ఎలా చూపెడతాడో అనే ఆ శక్తి అక్కినేని అభిమానులలో రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ ముదురు పెట్టలతో చైతూ ఎలా వేగుతాడో చూడాలి….

హలో బ్రదర్ రీమేక్ తో చైతూ సాహసం చేస్తున్నాడా….?

1371306645-1108

దాదాపు 20 సంవత్సరాల కిందట విడుదలైన సినిమాను అప్పుడే రీమేక్ చేయడం ఒక రకంగా విచిత్రమే! బహుశా అక్కినేని అబ్బాయికి విజయాల కరువు తీస్తుందనే ఆశ కాబోలు! తండ్రి కెరీర్ లో సూపర్ హిట్టైన సినిమానే నమ్ముకున్నారు. అదే పేరుతో డ్యూయల్ రోల్ తో జనాల ముందుకు వస్తున్నారు. ఈమధ్య కాలంలో హిందీలో కూడా పాత సినిమాల రీమేక్ ట్రెండ్ వచ్చింది. అయితే వారు ఒరిజినల్ సినిమా వచ్చి 30 సంవత్సరాలు పూర్తయితే కానీ రీమేక్ పని పెట్టుకోలేదు.

అమితాబ్ యాంగ్రీ యంగ్ మ్యాన్్గా వచ్చిన సినిమాలను ఆయన ముసలాడు అయ్యాక వేరే హీరోలను పెట్టి రీమేక్ చేస్తున్నారు. కానీ హలో బ్రదర్ కహానీ అలా లేదు. ఈ సినిమాలో హీరోగా నటించిన నాగార్జున అప్పట్లో ఎలాంటి పాత్రలలు చేస్తున్నాడో , ఇప్పుడూ అలాంటి రోల్సే చేస్తున్నాడు. అవేడాన్సులు చేస్తున్నాడు, అలాగే హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు.నాగార్జున సంగతి పక్కన పెడితే… ఒరిజినల్ హలో బద్రర్ సినిమా ను పిల్లలుగా చూసిన వారు ఇంకా పెద్ద వాళ్లు అయిపోలేదు, యువకులుగా చూసిన వారు ముసలి వాళ్లూ అయిపోలేదు..కానీ అప్పడే రీమేక్ ఎందుకు? అంటే…ఈ సినిమా రూపకర్తలు  ఒకే మాట చెబతున్నారు.

తాము ఈ సినిమాను పూర్తిస్థాయిలో రీమేక్ చేయడం లేదని…కేవలం ఆ సినిమా నుంచి ఒక పాయింట్ తీసుకుని మాత్రమే నాగచైతన్యను డ్యూయల్ రోల్ లో చూపబోతున్నామని వీరు అంటున్నారు. నాగా ర్జున హలోబ్రదర్‌ పాయింట్‌ తీసుకుని ప్రజెంట్‌ ట్రెండ్‌కు అనుగుణంగా నిర్మిస్నున్న ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ఇది అని స్పష్టం చేస్తున్నారు. హలో బ్రదర్ జ్ఞాపకాలు ఫ్రెష్ గా ఉండంగానే వస్తున్న ఈ రీమేక్ సినిమా ఎంత మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ కు రీచ్అ వుతుందో!

 

“భాయ్” లో కామ్నా…!

kamna

రణం, సామాన్యుడు లాంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన కామ్నా జట్మలాని ప్రస్తుతం టాలీవుడ్ లో సందడి చేయడం లేదు. కాని ఆమెకు అనుకోకుండా అదృష్టం వరించింది. నాగార్జున హీరోగా నటిస్తున్న “భాయ్” సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ సినిమాలో రిచా గంగోపధ్యాయా నాగ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రను చేయడానికి కామ్నా ను తీసుకున్నట్లుగా సమాచారం. పాత బస్తీలో ఉండే యువతీ పాత్రలో కామ్నా జట్మలాని కనిపిస్తోంది అట. మరి ఈ పాత్ర తో కామ్నా జట్మలాని టాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి.

ఇద్దరు అమ్మాయి లతో నాగ్

images (1)నాగార్జున మ‌హా జోరుగా ఉన్నారు.అంతే కాదు తన స్పీడు కూడా పెంచాడు  ‘, ‘భాయ్‌’, ‘మ‌నం’… వీటితో పాటు ‘డాలీ’ సినిమాకీ ప‌చ్చజెండా ఊపారు. ఈ సినిమాలో ఇద్దరు క‌థానాయిక‌ల‌కు ఛాన్స్ ఉంద‌ట‌. ఓ పాత్ర ఆండ్రియాకి ద‌క్కే అవ‌కాశం ఉంది. మ‌రో క‌థానాయిక కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవ‌లే నాగ్‌- డాలీ మ‌ధ్య క‌థాచ‌ర్చలు పూర్తయ్యాయి. డాలీ చెప్పిన లైన్ నాగ్‌ ని ఇంప్రెస్ చేసింద‌ట‌. ఈ సినిమా వెంట‌నే ప‌ట్టాలెక్కించే అవ‌కాశాలున్నాయి. మరోవైపు భాయ్ షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. దాదాపు 60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకొంది. సెప్టెంబ‌రులో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

 

తడాఖా దర్శకుడితో నాగ్

images (8)తడాఖా’ చిత్ర దర్శకుడు డాలీ తో నాగార్జున కొత్త ప్రాజెక్ట్ ఖరారైంది. ఈ చిత్రాన్ని ‘తడాఖా’ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి నిర్మాత బెల్లం కొండ చెబుతూ.. “తడాఖా సినిమా చూసి నాగార్జున గారు ఎంతో ఇంప్రెస్ అయ్యారు. అందుకే, డాలీతో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. ఆ వెంటనే నాగార్జున కోసం డాలీ అద్భుతమైన కథ రెడీ చేశాడు. మా బ్యానర్లో నాగ్ తో  ఓ భారీ సినిమా తీయాలన్న నా కోరిక దీంతో నెరవేరుతోంది” అన్నారు. ప్రస్తుతం నాగ్ భాయ్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. భాయ్ షూటింగ్ పూర్తవ్వగానే ఈ  కొత్త ప్రాజెక్ట్ సెట్స్ పై కి వెళ్లనుంది.

ఆండ్రియా తో జత కడుతున్న నాగ్

images (7)తెలుగులో ఆండ్రియా చిత్రాలు రెండు రిలీజ్‌ అయ్యేసరికి ఆమె క్రేజ్‌ ఏర్పర్చకుంది. పెద్ద చిత్రం ‘ఇద్దరమ్మాయిలతో’ సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆమెపై పుకార్లు వచ్చేశాయి. గతంలో ‘కొలవెరి’ పాట ట్యూన్‌ చేసిన అనిరుధ్‌తో ఎఫైర్‌ ఉందనే వార్తలూ వచ్చాయి. ఆ తర్వాత మలయాళ దర్శకుడు ఫాజిల్‌తో ప్రేమాయణం సాగిస్తుందని తెలిసింది.

ప్రస్తుతం ఇద్దరమ్మాయిలతోలో హైప్‌ వచ్చే పాటలో ఆమె కన్పిస్తుంది. టాప్‌లేచిపోద్ది.. అంటూ ఆ పాటలో తన సత్తాను నిరూపించుకుంది. ఇటీవలే ఆమెను కలిసి ప్రేమాయణం గురించి అడిగితే…. కోపగించుకోకపోగా… ఆ విషయాలు పెద్దగా పట్టించుకోనంది.

నిజమో అబద్ధమో మీరే రాసేసుకోండని తెలివిగా స్పందిస్తూ… ఇది నా వ్యక్తిగతం. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడనని చెప్పింది. లేటెస్ట్‌గా ఆమెపై నాగార్జున కన్ను పడింది. త్వరలో ప్రారంభం కాబోయే చిత్రంలో ఆమెను బుక్‌ చేసేశాడు.

అక్కినేని ఆవకాయ పచ్చడి …

Nagarjuna-Latest-Stills(1)హీరో నాగ్ మదర్స్ డే సందర్భం గా తన జ్ఞాపకాలను పంచుకున్నారు షూటింగ్ అంటే ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఉదయం లొకేషన్‌కి వెళ్లేప్పుడు హుషారుగా, సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేటప్పుడు అలసటతో ఇంటికి తిరిగొస్తుంటాం. ఇంటికి రాగానే ‘అలసిపోయావా’ అంటూ అమ్మ తల నిమురుతుండేది. నాన్నగారు అది గమనించి ‘ఎప్పుడైనా నన్నలా చేశావా?’ అని సరదాగా అడిగేవారు. అప్పుడు అమ్మ ‘మీరు వేరు.. మా అబ్బాయి వేరు’ అనేది. పిల్లలు పుట్టేవరకు భర్త మీద, పుట్టిన తర్వాత భర్త మీదకన్నా ఆడవాళ్లకి పిల్లల మీద ఎక్కువగా ప్రేమ ఉంటుందట. ఇలా జరిగినప్పుడు నాకది కరెక్ట్ అనిపించేది.

అమ్మ చనిపోయినప్పుడు, ఇక అమ్మ లేదే అనే బాధ మరోవైపు.. అనారోగ్యంతో తను పడిన బాధల నుంచి విముక్తి దొరికిందనే ఫీలింగ్ మరోవైపు. ఏదేమైనా అమ్మ లేని లోటు ఎప్పటికీ లోటుగానే ఉంటుంది. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్నగారు సినిమాలతో బిజీగా ఉండేవారు కాబట్టి అమ్మతో ఎక్కువ సమయం గడిపేవాణ్ణి. నాకేం కావాలన్నా అమ్మతో చెప్పి నాన్నకి సిఫార్సు చేయించుకునేవాణ్ణి. కుటుంబ బాధ్యతలన్నీ మోస్తున్నా అమ్మలో ఆ విసుగు ఇసుమంత కూడా కనిపించేది కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఆ నవ్వు చూస్తే టెన్షన్స్ అన్నీ ఇట్టే మాయమయ్యేవి. సమ్మర్ వస్తే చాలు.. మా ఫ్యామిలీ మొత్తానికి ఆవకాయ పచ్చడి పట్టేది. ఆ రుచి ఎంత కమ్మగా ఉండేదో. అమ్మ పోయిన తర్వాత ఆ బాధ్యతను నాన్నగారు తీసుకున్నారు. అమ్మ ఉన్నప్పుడు రెసిపీ రాయించుకున్నారు. దాన్ని ఫాలో అవుతూ, ఆవకాయ పచ్చడి తయారు చేయించారు. టేస్ట్ చేస్తే అచ్చం అమ్మ పెట్టినట్టే ఉంది. ‘అక్కినేని ఆవకాయ’ అని పేరు పెట్టి, అమ్మితే సేల్స్ బ్రహ్మాండంగా ఉంటుందని నాన్నతో సరదాగా అన్నాను. అమ్మ గురించి ఇంకా చెప్పాలంటే.. ఎప్పుడైనా మూడ్ బాగాలేకపోతే ఇట్టే గ్రహించేసేది. ‘ఏమైంది నాన్నా..’ అంటూ ఆప్యాయంగా మాట్లాడేది. అప్పుడు మూడ్ మళ్లీ మామూలుగా మారిపోయేది. అదీ మా అమ్మ గొప్పదనం.’’అంటూ తన తల్లిని గుర్తుకు తెచ్చు కున్నారు ..