Blog Archives

సిద్ధార్ద్ కు తెలుగు ప్రేక్షకులు నచ్చలేదు….!

sidhu

తెలుగు సినిమాల ద్వారా స్టార్ స్టేటస్ సంపాదించి, దాదాపు 8 ఏళ్ళుగా తెలుగు సినిమాలనే ఎక్కువగా చేసిన హీరో సిద్ధార్ద్ కు తెలుగు ప్రేక్షకులు హటాత్తు గా నచ్చడంలేదు. నిన్న చెన్నై లో హీరో సిద్ధూ తెలుగు ప్రేక్షకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి దుమారాన్ని లేపాడు. ఇటీవల సిద్ధూ హీరోగా నటించిన “సమ్ థింగ్ సమ్ థింగ్” తెలుగు లో విడుదల అయి పెద్దగా ప్రజాదరణ పొందలేదు. ఈ విషయమై పత్రికల వారితో నిన్న చెన్నై లో మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో పెద్ద హీరోల సినిమాలు మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారని, మిగతా సినిమాలను నిర్లక్ష్యం చేస్తున్నారని, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. అంతేకాదు తన సినిమాలు టాలీవుడ్ లో కన్నా కోలీవుడ్ లోనే బాగా ఆడుతున్నాయి అని కూడా చెప్పాడు.

మరి ఇదే సంవత్సరం చిన్న సినిమాలుగా విడుదల అయి పెద్ద సినిమాల రేంజ్ కి ఎదిగిన “స్వామి రారా”, ‘గుందేజారి గల్లంతైందే’, ‘ప్రేమ కధా చిత్రం’ విజయాల గురించి సిద్ధార్ద్ కు తెలియదా..? లేక అవగాహన లేకుండా ఇలాంటి సుదీర్గ అనుభవం ఉన్న హీరో మాట్లాడుతున్నాడా..? అని అందరినీ ఆశ్చర్య పరస్తోంది. బహుశా తన సినిమాలు వరసగా తెలుగులో పరాజయం పొందడంతో నిరాశ గా సిద్ధూ ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవాలి.

కన్నడ సినిమాల వైపు పరుగెడుతున్న టాలీవుడ్

dhandupalyamప్రస్తుతం టాలీవుడ్ సినిమా కన్నడ సినిమా కధల వైపు చూస్తుంది. నిన్నటి దాకా తమిళ సినిమాలను, హిందీ సినిమాలను ఎక్కువగా టాలీవుడ్ సినిమాలుగా రీమేక్ చేసిన టాలీవుడ్ నిర్మాతలు, ప్రస్తుతం తమ రూట్ ను కన్నడ సినిమా వైపు మార్చారట. దీనికి ఉదాహరణగా నాగ చైతన్య హీరోగా కన్నడలో సూపర్ హిట్ అయిన “చార్మినార్” సినిమాను తెలుగులో నిర్మిస్తుంటే,మంచు మనోజ్ హీరోగా కన్నడంలో హిట్ అయిన గోవిందాయా నమః సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సుదీప్ పాపులారిటీ ని క్యాష్ చేసుకోవడానికి ఇప్పటికే అతడు నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. కన్నడంలో హిట్ అయిన దండుపాల్యం సినిమా తెలుగులో డబ్ అయి విడుదల అయి అర్ధ శత దినోత్సవం కూడా జరుపుకోవడం చాలామంది తెలుగు నిర్మాతలను ఆశ్చర్య పరచింది. పెద్ద సినిమాలు కూడా యాభై రోజులు ఆడలేని నేటి పరిస్థితులలో దండుపాల్యం అర్ధ శత దినోత్సవం జరుపుకోవడం రికార్డు అంటున్నారు. ఈ తరహా లో చాలా కన్నడ సినిమాలు తెలుగులో రిమేక్ కాబోతున్నాయి అని టాక్….