Blog Archives

శంకర్ తో పాట్లు పడుతున్న ఆమీ జాక్సన్

amy-jackson-350_020612115429-1

ప్రస్తుతం దక్షినాది సినిమాలలో ఆమీ జాక్సన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈమెతో చెయ్యడానికి చాలా మంది యువ హీరోలు, పెద్ద హీరోలు కూడా ముచ్చట పడుతున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రం హీరో గా రూపొందుతున్న “ఐ” సినిమాలో అమీ నటిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే నటనకు ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో తమిళంలో సుదిర్గ డైలాగ్స్ చెప్పడానికి అమీ జాక్సన్ నానాపాట్లు పడుతుందట. ఆమె కు తమిళం నేర్పించి, ఏదో విధంగా ఈ షూటింగ్ అయింది అనిపిద్దామని దర్శకుడు శంకర్ తో పాటు యూనిట్ సభ్యులు అంతా అమీ కి నటన నేర్పించే కార్యక్రమం చేపట్టారట. హాట్ లుక్స్ తోటి బికినీ లు కూడా వేసుకోవడానికి రెడీ అయిన ఆమీ, నటించమంటే మటుకు శంకర్ కు చుక్కలు చుపెడుతుందట. సినిమా మధ్యలో ఉంది కాబట్టి ఈమెను తొలగించడం సాధ్యం కాక ఏదో విధంగా ఈమెకు నటనా, తమిళం నేర్పే పనిలో హీరో విక్రం, శంకర్ బిజీ గా ఉన్నారట. ఇంతకీ ప్రస్తుతం రామ్ చరణ్ తో “ఎవడు” లో నటిస్తున్న ఆమీ, తెలుగులో ఎలా ఇరగదిస్తుందో చూడాలి.

బాక్సర్ అవతారం లో హీరో విక్రమ్

Thandavam-Movie-Audio-Release-Function-Photos-1891శంక‌ర్ సినిమా ‘అప‌రిచితుడు’ సినిమాతో స్టార్ హోదా తెచ్చుకొన్నాడు విక్రమ్‌. ఆ సినిమా త‌ర‌వాత విక్రమ్‌ కి అన్నీ ఫ్లాపులే. మ‌ళ్లీ ఇప్పుడు శంక‌ర్ జ‌త క‌ట్టాడు. వీరిద్దరి క‌ల‌యిక‌లో ‘ఐ’ అనే చిత్రం రూపుదిద్దుకొంటోంది. మ‌ళ్లీ.. శంక‌రే.. విక్రమ్‌ కి ఓ హిట్ అందించాలి. అన్నట్టు ఈ సినిమాలో విక్రమ్ బాక్సర్ అవ‌తారం ఎత్తాడు. త‌మిళ‌నాడు ఛాంపియ‌న్ గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఈ పాత్ర కోసం విక్రమ్ చాలా క‌స‌ర‌త్తులు చేశాడు. ప్రొఫెష‌న‌ల్ బాక్సర్ గా క‌నిపించ‌డానికి తెగ క‌ష్టప‌డ్డాడ‌ట‌. అంతేకాదు.. ఏకంగా ఏనిమిది కిలోల బ‌రువు కూడా త‌గ్గాడ‌ట‌. ఇదంతా శంక‌ర్ సినిమా కోస‌మే. ఈ సినిమాలో బాక్సింగ్ సీక్వెన్స్ చాలా కీల‌క‌మ‌ట‌. విక్రమ్ ప‌డ్డ క‌ష్టానికి ప్రతిఫ‌లం వ‌స్తుందో రాదో తెలియాలంటే కొంత కాలం ఆడాల్సిందే.