జనార్ధన మహర్షి కి “పవిత్ర” బ్రేక్ ఇస్తుందా…?

2_276_681_shriya stills in pavithra (14)

కే.బాలచందర్, శ్యాం బెనగల్ లాంటి గొప్ప దర్శకులు వేశ్య పాత్రలను తమ సినిమాలలో చాలా గొప్పగాచూపించారు. అంతేకాకుండా వీరు ఆ పాత్రలను ఒక్కొకోణంలో ఆవిష్కరించారు. మన తెలుగులో కూడా చాలామంది దర్శకులు వేస్యపాత్రలను  చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మహానటి సావిత్రి నుంచి నేటి అనుష్క వరకూ ఈ పాత్రలను చేసిన వారే. ఈనెల 7 తారీఖున విడుదల కాబోతున్న పవిత్ర సినిమా జనార్ధన మహర్షి – శ్రియ ల కెరియర్ కు ఒక ముఖ్య చిత్రం కానుంది. ఇది వరకు దేవస్థానం లాంటి తిరుపతి లడ్డూ లాంటి సినిమా తీసిన జనార్ధన మహర్షి, మిరపకాయ బజ్జీ లాంటి పవిత్ర సినిమా తీయడం అందరినీ ఆశ్చర్యపరస్తోంది.

కీరవాణి సోదరిమణి శ్రీలేఖ అందించిన సంగీతం, జనార్ధన మహర్షి సంబాషణలు ఈ సినిమాకు ఆయుపట్టుగా మారనున్నాయి. మూడు పదుల వయసు ధాటి పోయి శ్రియ పని అయిపొయింది అని వార్తలకు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమాలో శ్రియ నట విశ్వరూపం చూడబోతున్నారు అని జనార్ధన మహర్షి చెపుతున్నారు. దేహాన్ని అమ్ముకొనే వేశ్య, దేశాన్ని అమ్ముకొనే రాజకీయ నాయకుడు కన్నా గొప్ప వ్యక్తి అని చూపించే సామాజిక కోణం ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.

Posted on June 5, 2013, in Telugu, Telugu Cinema and tagged , , , , , , , . Bookmark the permalink. Leave a comment.

Leave a comment